Mahesh Babu Anniversary: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ ముందుంటారు. ఇక నేడు వారి పెళ్లి రోజు సందర్భంగా మాహేశ్ బాబు స్పెషల్ ట్వీట్ చేశారు. వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నమ్రతకు శుభాకాంక్షలు చెప్పారు. తన సతీమణిని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.
స్పెషల్ ట్వీట్ చేసిన మహేశ్ బాబు..
తన సతీమణి నమ్రతా శిరోద్కర్ కు మహేశ్ బాబు 18వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ట్వీట్ చేస్తూ.. జీవితాంతం ఇలాగే కలిసి ఉందామని కోరారు. ఓ ఫొటోని షేర్ చేసిన ఆయన.. మనం.. ఒకింత క్రేజీ, మరెంతో ప్రేమ..! మనం ఒక్కటై 18 ఏళ్లు అవుతోంది. మరెన్నో ఏళ్లపాటు మనం ఇలాగే కలిసి జీవించాలి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నమ్రతా శిరోద్కర్. అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నమ్రత స్పందిస్తూ.. ఐ లవ్ యూ అంటూ తన ప్రేమను తెలియజేశారు. అంతే కాకుండా.. 18 ఏళ్ల క్రితం తాము తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనని ఇద్దరు రాసుకొచ్చారు. పెళ్లి రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ జంట.. గురువారం సాయంత్రం స్విట్జర్లాండ్‌కు వెళ్లింది.
మెుదటిసారిగా వంశీ సినిమాలో ఈ ఇద్దరు నటించారు. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేట్‌లో ఉన్న వీరు.. 2005లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత నమ్రత.. సినిమాల్లో నటించలేదు.
18 years together and forever to go! Happy anniversary NSG ♥️♥️♥️ pic.twitter.com/E1uHd2k7q5
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2023
మహేశ్ బాబు- నమ్రత లవ్ స్టోరీ ఇదే..
వీరిద్దరికి తెరపైనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఎంతోమంది అభిమానులున్నారు. మహేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే.. నమ్రత మాత్రం ఇంటి బాధ్యతలతో పాటు మహేశ్ (Mahesh Babu) కాస్ట్యూమ్స్ విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. మరో వైపు మహేశ్ వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటారు. అసలు వీరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది.. అంత సీక్రెట్‌గా పెళ్లెందుకు చేసుకున్నారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వీరిద్దరు వంశీ సినిమాలో మెుదటిసారి కలుసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా.. 25 రోజుల పాటు న్యూజిలాండ్ వెళ్లారట. ఆ సమయంలోనే మహేశ్-నమ్రతల స్నేహం చిగురించింది. షూటింగ్ తర్వాత.. మెుదటగా నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచినట్లు తెలిపింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఇష్టం ఉండటంతో.. వెంటనే ఓకే చెప్పేశారట.
ఇక్కడ మరో ట్వీస్ట్ కూడా ఉంది. మెుదట్లో మహేశ్ బాబు Mahesh Babu కుటుంబం ఈ ప్రేమకు.. అంగీకరించలేదట. ఈ వ్యవహారంలో మహేశ్ సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. దీంతో ఈ జంట.. 2005 ఫిబ్రవరి 10న ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. సాధారణంగా వీరి విషయం ఎక్కడా బయటపడలేదు. ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా వీరు జాగ్రత్తలు తీసుకున్నారు.