Site icon Prime9

Monalisa: ‘కుంభమేళ’ స్టార్‌ మోనాలిసా బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ – స్వయంగా ఇంటికి వెళ్లి అగ్రీమెంట్‌ చేసుకున్న డైరెక్టర్‌

Maha Kumbh Mela Viral Girl Monalisa: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌ మహాకుంభమేళ పేరు వినగానే నేటిజన్స్‌ వెంటనే మోనాలిసా పేరు చెబుతున్నారు. కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమెను ఓ మీడియా ఇంటర్య్వూ చేసింది. ఈ వీడియోలో మోనాలిసా తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో రాత్రికి రాత్రి ఆమె సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. కుంభమేళలో ప్రతి ఒక్కరు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు.

దీంతో మోనాలిసా ప్రయాగ్‌రాజ్‌ వదిలి తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే మోనాలిసాకు మూవీ ఆఫర్‌ వచ్చిందని, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగింది. ఆమెతో సినిమా చేస్తానని దర్శకుడు సనోజ్‌ మిశ్రా ప్రకటించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లారు. మోనాలిసా కోసం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన ఆయన అక్కడ ఆమె లేదని తెలిసి మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలోని మహేశ్వర్‌లో మోనాలిసా ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సినిమాకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

అనంతరం ఆయన వీడియో షేర్‌ చేశారు. మోనాలిసాకు తన రాబోయే చిత్రంలో ఆఫర్‌ ఇచ్చినట్టు చెప్పారుజ “ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌ కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికలు. అందులో మోనాలిసా ఒకరు. మోనాలిసా సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. అందుకే ఆమెకు నా సినిమాలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అయితే తనకు నటనపై అవగాహన లేదని తెలుసు. అందుకు ఆమె మొదట నటనలో శిక్షణ ఇప్పిస్తాను. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా ప్రారంభిస్తాం” అని ఆయన చెప్పుకోచ్చారు.

Exit mobile version
Skip to toolbar