Site icon Prime9

Made In India Movie : రాజమౌళి సమర్పణలో “మేడ్ ఇన్ ఇండియా”.. ఎవరి బయోపిక్ అంటే ?

made in india movie announced as ss rajamouli presenter

made in india movie announced as ss rajamouli presenter

Made In India Movie : బయోపిక్.. భాషకు అతీతంగా ఇప్పటి వరకు ఎంతో మంది సినీ, రాజకీయ, పలు రంగాలలో రాణించిన పముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే బ‌యోపిక్స్ కు కూడా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగా ఉంటుంది. ప్ర‌ముఖుల జీవితాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో వారిపై చేసే సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద హంచి హిట్టుగా నిలుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు ప్రముఖులపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి.. అలానే త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో..  నితిన్ కక్కర్ దర్శకుడుగా రాబోతున్న చిత్రం “మేడ్ ఇన్ ఇండియా”. ఈ చిత్రాన్ని (Made In India Movie) రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షోయింగ్ బిజినెస్, ఎ మేజర్ మోషన్ పిక్చర్ సంస్థలపై సినిమా తెరకెక్కుతోంది. కాగా సోషల్ మీడియా వేదికగా ఈ రోజు సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. మరాఠీ, తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు రాజమౌళి ట్విట్టర్ లో.. ”నేను ఫస్ట్ టైమ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కథ విన్నప్పుడు.. భావోద్వేగానికి లోను అయ్యాను. బయోపిక్ తీయడం కష్టం. అందులోనూ ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమా బయోపిక్ తీసి కన్వీన్స్ చేయడం మరింత కష్టం. అందుకు మా బాయ్స్ రెడీగా ఉన్నాను. సగర్వంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాను ప్రజెంట్ చేస్తున్నా” అని రాసుకొచ్చారు.

 

‘మేడ్ ఇన్ ఇండియా’

 

 

ఈ మూవీ భారతీయ సినిమా పితామహుడిగా (ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా) చరిత్రకు ఎక్కిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్ అని సమాచారం అందుతుంది. మన దేశంలో తొలి ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తీసిన ఘనత దాదా సాహేబ్ ఫాల్కే సొంతం. 1913లో ఆ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అసలు ఇండియాలో సినిమా ఎలా పుట్టింది ? ఫాల్కే ఏం చేశారు ? భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఏమిటి ? వంటి అంశాలతో పాటు ఆయన జీవితాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో అని..

Exit mobile version