Site icon Prime9

RC16: రామ్ చరణ్ RC16 పై లేటెస్ట్ అప్ డేట్ ..

RC16

RC16: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌తో కొత్త నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రారంభం కానుంది.వెంకటేష్ సతీష్ కిలారు మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ బ్యానర్ నుండి ఇది మొదటి పాన్ ఇండియా ఎంటర్ టైనర్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడని, చరణ్ కూడా ఆ సినిమా గురించి ఎక్సైటింగ్ గా ఉన్నాడని టాక్ .

జనవరిలో RC16 లాంచ్ అవుతుందని, 2023 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ లేదా AR రెహమాన్‌ని కన్ఫర్మ్ చేస్తారని కూడా అంటున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన RC15 భారీ స్థాయిలో రూపొందుతోంది .

Exit mobile version