Site icon Prime9

Laal Singh Chaddha and Raksha Bandhan: కనిపించని ప్రేక్షకులు.. లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ షోలను రద్దు చేస్తున్న ఎగ్జిబిటర్లు

Bollywood: బాలీవుడ్ కు ఇది బాడ్ న్యూస్, బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కారణంగా ధియేటర్ల యజమానులు లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ రెండింటి షోలను స్వచ్ఛందంగా తగ్గించారు. “రెండు సినిమాలు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 షోలతో విడుదలయ్యాయి వాటిలో ఏ ఒక్కటీ కూడ ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. పరిమిత షోలలో ఆక్యుపెన్సీని పెంచడానికి రెండవ రోజు రెండు చిత్రాల ప్రదర్శనను తగ్గించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు,

లాల్ సింగ్ చద్దా యొక్క దాదాపు 1300 షోలు తగ్గించబడ్డాయి. రక్షా బంధన్ దేశవ్యాప్తంగా 1000 షోల తగ్గింపును చూసింది. లాల్ సింగ్ చద్దా మాస్ బెల్ట్‌లలో వాష్ అవుట్ అయితే, రక్షా బంధన్ కొన్ని మల్టీప్లెక్స్‌లలో షోలు కూడ రన్ అవలేదు. షోలు తగ్గించినప్పటికీ, ప్రేక్షకులు లేకపోవడంతో శుక్రవారం ఉదయం రెండు చిత్రాలకు సంబంధించిన అనేక ప్రదర్శనలు రద్దు చేయబడ్డాయి. నిజంగా ఇది బాలీవుడ్ కు చేదు అనుభవమే అని చెప్పవచ్చు.

Exit mobile version