Site icon Prime9

Kriti Sanon: అతడితో ‘ఆదిపురుష్‌’ బ్యూటీ కృతి సనన్ డేటింగ్‌ – బాయ్‌ఫ్రెండ్‌తో సెల్పీ, ఇలా కన్‌ఫాం చేసిందా?

Kriti Sanon Confirmed Her Relation With Kabir Bahia: కృతి సనన్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఇందులో కృతి తన గ్లామరస్‌ లుక్‌తో, అందంతో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్యతో దోచేయ్‌ చేసింది. కానీ ఇది ప్లాప్‌ అవ్వడంతో ఈ భామ బాలీవుడ్‌ చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్‌ అందుకుంటే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

చాలా కాలం తర్వాత ఈ భామ ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. ఇందులో సీతగా నటించి మెప్పించింది. హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మంచి అందం, అభినయం ఉ న్న కృతి రిలేషన్‌ షిప్ స్టేటస్‌ సింగిల్‌ అని అనుకున్నారు. కానీ ఇటీవల విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడే తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో క్లోజ్‌గా ఫోటోలు దిగడంతో అతడు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఈ మధ్య ఎక్కడ చూసిన వీరిద్దరు జంటగా కనిపిస్తున్నారు.

ఇటీవల దీపావళి వేడుకల్లో కూడా ఇద్దరు కనిపించారు. కృతి ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌లో కూడా పాల్గొన్నాడు. అతడి పేరు కబీర్‌ బహియా. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు కృతి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇవాళ(నవంబర్‌ 20) కబీర్‌ బహియా బర్త్‌డే. ఈ సందర్భంగా అతడితో దిగిన సెల్ఫీని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే K! మీ ఇన్నోసెంట్‌ స్మైల్‌ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నా” అంటూ విషెస్‌ చెప్పింది.

అయితే దీనికి రెడ్ హార్ట్‌ ఎమోజీని కూడా జత చేసింది. దీంతో కృతి తన రిలేషన్‌షిప్‌పై ఇన్‌డైరెక్టర్‌గా క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. దీనికి కబీర్‌ కూడా రిప్లై ఇచ్చాడు. రెండు హార్ట్‌ ఎమోజీలతో కేరింగ్‌ ఎమోజీలతో కృతి పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు ఇక కబీర్‌ బహియా విషయానికి వస్తే అతడు యూకేకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృతి సోదరి నుపుర్‌ సనన్‌, ఆమె ప్రియుడు స్టెబిన్‌ బెన్‌ సైతం కబీర్‌ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

Exit mobile version