Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ అంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు “ప్రభాస్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే దేశ, విదేశాల్లో సైతం మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పలు సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరో.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. చేతిలో అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ఈ యంగ్ హీరో.
అయితే అప్పట్లో ప్రభాస్ ప్రముఖ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి డేటింగ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు అయిన కృతి సనన్, దీపికా పదుకునే లతో కలిసి నటిస్తున్నాడు. దీపికాకి పెళ్లి అయిపోగా.. కృతి తోనే డేటింగ్ చేస్తున్నాడానే వార్తలు బలంగా వినిపించాయి.
ప్రభాస్, కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి కృతిసనన్ గత ఏడాది చేసిన సినిమా ‘భేడియా’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్.. కృతిసనన్, ప్రభాస్ తో ప్రేమలో ఉంది అంటూ ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ విషయం పై వీరిద్దర్నీ పలు వేదికల ప్రశ్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో కూడా ప్రభాస్ కి ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. బాలకృష్ణ, ప్రభాస్ ని ఈ రూమర్స్ గురించి అడగగా అటువంటిది ఏమి లేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ కి కాల్ చేసి విషయం చెప్పాను – కృతి (Prabhas)
ఇక కృతిసనన్ కూడా ఇప్పటికే పలుమార్లు దీని పై క్లారిటీ ఇవ్వగా, తాజాగా మరోసారి ఆ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతిని ఈ రూమర్స్ గురించి ప్రశ్నించగా.. ”మొదట నేను కూడా వీటిని పట్టించుకోలేదని, కానీ నా ఫ్రెండ్స్ నుంచి కూడా కంగ్రాట్యులేషన్స్ మెసేజ్ లు వస్తుండడంతో రెస్పాండ్ అయ్యాను. ఈ విషయం గురించి ముందుగా ప్రభాస్ కి క్లారిటీ ఇవ్వాలని అతనికి ఫోన్ చేశాను. ఇక కాల్ లిఫ్ట్ చేసిన ప్రభాస్.. అసలు వరుణ్ ఎందుకు అలా చెప్పాడంటూ నన్ను ప్రశ్నించాడు. నేను నాకు తెలియదు అని చెప్పాను. వరుణ్ నా ఫ్రెండ్, అతను పిచ్చిగా ఆలోచించి మనం ఇద్దరం ప్రేమలో ఉన్నాము అనుకున్నాడు అని చెప్పాను. అది విన్న ప్రభాస్ నవ్వాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
I felt bad when Varun said about me &
.#Prabhas I told Prabhas on fone that Varun is my bit mad friend
Prabhas is a clam person, he said, but why did he say that? I said lets leave it.
I reacted when I started getting congratulations messages.
.@kritisanon pic.twitter.com/QBxn1zoxup— Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) March 8, 2023
ఇక మరోవైపు ప్రభాస్.. ఆదిపురుష్ షూటింగ్ తో పాటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే మారుతి సినిమా మొదలుపెట్టి అది కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అదే విధంగా ప్రభాస్ నాగ్ అశ్విన్ తో “ప్రాజెక్ట్ K” చేస్తుండగా.. ఇప్పటికే 70% కంటే పైనే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ నాలుగు సినిమాలు కాకుండా నెక్స్ట్ ఇంకో రెండు సినిమాలు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి, సందీప్ వంగ దర్శకత్వంలో ఒకటి ప్రకటించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/