Kiara Advani: బాలీవుడ్ స్టార్ జోడి కియారా అద్వానీ- సిద్దార్ధ్ మల్హోత్రా వెడ్డింగ్ కోసం రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ వేదికగా మారింది. ఈ నెల 6 న వీరిద్దరూ వివాహబందంతో ఒక్కటవనున్నారు. అందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు , కుటుంబ సభ్యులు శనివారం జైసల్మేర్ చేరుకుంటారు. ఇప్పటికే కియారా.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తో కలిసి జైసల్మేర్ చేరుకుంది. ఈ సందర్భగా వారు జైసల్మేర్ ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 7 న ముంబైలో గ్రాండ్ గా రెసెప్షన్ నిర్వహించునున్నట్టు సమాచారం. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు వైభవంగా నిర్వహించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు , దగ్గరి ఫ్రెండ్స్ మాత్రమే హాజరుకానున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/