Site icon Prime9

Ramayana movie: రామాయణ మూవీలో యశ్ నిజమైన బంగారంతో చేసిన దుస్తులు ధరించాడా?

Ramayana movie

Ramayana movie

Ramayana movie: బాలీవుడ్‌ టాప్‌ హీరో రణబీర్‌కపూర్‌ నటిస్తున్న రామాయణ చిత్రం విడుదల కాక ముందే పలు సంచనాలు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ చిత్రం బడ్జెట్‌ సుమారు రూ.850 కోట్ల వరకు ఉంటుందన్న వార్త ఇటీవలే వెలుగు చూసింది.

నిజమైన బంగారం వాడాలని.. (Ramayana movie)

ఇక తాజాగా రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్‌ స్టార్‌ ధరించే దుస్తులు స్వచ్చమైన బంగారంతో చేసిన దుస్తులన్న టాక్‌ వినిపిస్తోంది. రావణాసురుడు లంకకు రాజు. ఆ సమయంలో శ్రీలంక సంపదతో తులతూగుతోంది. రావణుడి పాత్రకు జీవం పోయాలనుకుంటే నిజమైన బంగారం వాడాలని నిర్మాతలు భావించారు.ఈ సినిమాల రావణుడి పాత్ర పోషిస్తున్న యశ్‌కూడా పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతి పూర్తిగా మార్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న బరువుకు అదనంగా మరో 15 కిలోల బరువు పెరగాల్సి వస్తోంది. కాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు యశ్‌ ఉన్నట్లు సమాచారం. రామాయణ కథ వివరంగా చెప్పడానికి రెండు పార్ట్‌లలో ఈ చిత్రం విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. నితీష్‌ తివారి టీం ఒకటే సారి పార్ట్‌-2 కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్ట్‌ -2లో రణబీర్‌ కపూర్‌, యశ్‌, పాయి పల్లవి, సన్నీ డయోలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పార్ట్‌ -1 విడుదల కాకముందే .. పార్ట్‌ -2లోని కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోందని చెబుతున్నారు. కాగా రెండు రెండు భాగాల రామాయణ సినిమా చిత్రీకరణకు 350 రోజుల షెడ్యూలు నిర్ణయించారు. వాటిలో కాంబినేషన్‌ సీన్స్‌తో పాటు సోలో సీన్స్‌ కలిసి ఉన్నాయి. అయితే రెండు భాగాల రామాయణ చిత్రం ఒక ఏడాది లోపే విడుదల అవుతుంది. ఈ చిత్రంలో రాముడుగా రణబీర్‌ కపూర్‌ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి, పది తలకాలయ రావణాసురుడిగా యశ్‌ నటిస్తున్నారు. సన్నీ డియోల్‌ విషయానికి వస్తే హనుమంతుడిగా.. లారాదత్తా కైకేయిగా..నటిస్తున్నారు. అలాగే విజయ్‌ సేతుపతిని విభూషుణుడి పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version
Skip to toolbar