Site icon Prime9

Keerthy Suresh: ప్రియుడిని పరిచయం చేసిన కీర్తి సురేష్‌ – 15 ఏళ్ల రిలేషన్ అంటూ సర్‌ప్రైజ్‌ చేసింది..

Keerthy Suresh -introduced Boyfriend: గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్‌ పెళ్లి అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు రూమర్స్‌ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ కీర్తి సురేశ్‌ ప్రియుడిని పరిచయం చేసింది. బాయ్‌ఫ్రెండ్‌ పేరు కూడా వెల్లడిచింది. కాగా కీర్తి సురేష్‌ తన లాంగ్‌ టర్మ్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటినే నిజం చేస్తూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసింది.

అంతేకాదు అతడి పక్కన తన పేరు జోడిస్తూ తన రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేసేంది. క్రాకర్స్‌ పేలుస్తున్న ఫోటోని బ్యాక్‌ నుంచి షేర్‌ చేసింది. ఇందులో బాయ్‌ఫ్రెండ్‌ ఫేస్‌ రివీల్‌ కాకుండ జాగ్రత్త పడింది. ఈ పోస్ట్‌లో తమది 15 ఇయర్స్‌ రిలేషన్‌ అని స్పష్టం చేసింది. ’15 ఇయర్స్ అండ్‌ కౌంటింగ్‌’ అతడితోనే తన జీవితం పంచుకుంటున్నట్టు చెప్పకనే చెప్పింది. ఆమె పోస్ట్‌కి హన్సీక, అనుపమపరమేశ్వరన్‌, మాళవిక మోహనన్‌లు హార్ట్‌ ఎమోజీలతో స్పందించారు. కీర్తి చెప్పిన ప్రకారం చూస్తే ఆంటోని తట్టిల్‌ ఆమె స్కూలింగ్‌ నుంచి పరిచయమని తెలుస్తోంది.

కేరళలోని జన్మించిన అతడికి దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డాడు. కొచ్చిలోనూ అతడికి చైన్ రిసార్ట్ బిజినెస్‌లు ఉన్నాయని సమాచారం. చిరకాల మిత్రులైన వీరు పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారట. వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. కీర్తి సురేష్‌-ఆంటోని తట్టిల్‌ గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ డిసెంబర్‌ 11, 12 తేదీల్లో వీరి పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌ అయ్యింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి హాజరుకానున్నారట.

ఎలాంటి హడావుడి లేకుండ ప్రశాంతంగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రకటన ఇవ్వాలనుకుంటున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కీర్తి సురేష్‌ తల్లి కూడా హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. హీరోయిన్‌ మేనక, నిర్మాత సురేస్‌ కుమార్‌ల కూతురే కీర్తి సురేష్‌. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన కీర్తి ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కెరీర్‌ మొదట్లో పెద్దగా సక్సెస్‌ చూడని కీర్తి.. ‘మహానటి’తో ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ అందుకుంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా  నాగ్‌అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి గానూ ఆమె ఏకంగా నేషనల్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ అడుగుపెడుతుంది.

Exit mobile version