Toxic Movie: కేజీఎఫ్ స్టార్ యశ్ ఏడాదిన్నర తరువాత తన తదుపరి చిత్రానికి సిద్దమయ్యాడు. టాక్సిక్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
త్వరలో క్లారిటీ..(Toxic Movie)
మొదట ఈ పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ తరువాత కరీనా కపూర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే కరీనా యష్‌కి జోడీగా నటిస్తుందా లేదా టాక్సిక్‌లో ప్రముఖ పాత్ర కోసం ఆమెను సంప్రదించారా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి త్వరలో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, డ్రగ్స్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025 న విడుదల అవుతుంది. కరీనా కపూర్ ఖాన్ ప్రస్తుతం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ షూటింగ్ పూర్తి చేసింది.త్వరలో త్వరలో అజయ్ దేవగన్‌తో సింఘమ్ ఎగైన్ సెట్స్‌లో జాయిన్ అవుతుంది.