Site icon Prime9

Hi Nanna: ‘హాయ్‌ నాన్న’ కథ నాది – నాని ఇంత చీప్‌గా ప్రవర్తిస్తాడనుకోలేదు, నిర్మాత సంచలన ఆరోపణలు

Copyright Allegations on Nani Hi Nanna: హీరో నానిపై కన్నడ సినీ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య సంచలన ఆరోపణలు చేశాడు. నాని ఇంత చీప్‌గా ప్రవర్తిసాడనుకోలేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కాగా 2023లో నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన హాయ్‌ నాన్న సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటూ యూత్‌ని, అటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు రూ. 75 కోట్ల వసూ్‌లు చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా తనది అంటూ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తన కథను దొంగలించి హాయ్‌ నాన్న సినిమాను తీశారంటూ మండిపడ్డాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్‌ షేర్‌ చేశాడు. “కాపీ రైట్స్‌ హక్కులు తీసుకోకుండానే మా చిత్రం భీమసేన నలమమహారాజ మూవీ కథను హాయ్‌ నాన్నగా తెలుగులో చిత్రీకరించారు. ఇంతకంటే చీప్‌ పని ఉంటుందా నాని” అంటూ హీరో నానిని ట్యాగ్‌ చేశాడు. ప్రస్తుతం అతడి పోస్ట్‌ నెట్టింట సంచలనంగా మారింది.

భీమసేన నలమహారాజ విషయానికి వస్తే.. కరోనా కారణంగా 2020లో ఈ సినిమా డైరెక్టర్‌ ఓటీటీలో విడుదలైంది. అరవింద్ అయ్యర్‌, అరోహి నారాయణ్‌, ప్రియాంక తమ్మేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్‌ సర్గూన్‌ దర్శకత్వం వహించాడు. రక్షిత్‌ శెట్టి, పుష్కర మల్లికార్జునయ్య ఈ సినిమాను నిర్మించారు. పాకశాస్త్రంలో చేయి తిరిగిన వ్యక్తి లతేషా.. ఓసారి అనుకోకుండా సారా అనే అమ్మాయిని కలుస్తాడు. వేదవల్లి అనే అమ్మాయితో తన ప్రేమకథను సారాకు చెబుతాడు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సారా-లతేషా మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటనేదే ఈ సినిమా కథ. ఇక హాయ్‌ నాన్న సినిమా విషయానికి వస్తే.. ప్రేమకథ, తండ్రి కూతురుల సెంటిమెంట్‌ నేపథ్యంలో కుటుంబ కథ నేపథ్యంలో హాయ్‌ నాన్న మూవీ తెరకెక్కింది. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుధాకర్‌ చేకూరి ఈ సినిమాను నిర్మించారు. 2023 డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలైంది.

Exit mobile version
Skip to toolbar