Site icon Prime9

Emergency OTT: ఓటీటీకి కంగనా రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Emergency Locks OTT Release Date: భారత మొదటి మహిళ ప్రధాని ఇందిరాగాందీ రాజకీయ జీవితం ఆధారం తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. అలా పలుమార్లు వాయిదా పడ్డ ఎమర్జేనీ అన్ని అడ్డంకులను దాటి జనవరి 17న థియేటర్లకు వచ్చింది.

బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఎమర్జెన్సీ చిత్రం త్వరలోనే ఓటీటీకి రానుందని, నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడించింది. మాజీ ప్రధాని ఇందిరగాందీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అత్యవసర పరిస్థితి సందర్భంలో దేశంలో, రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ఈ సినిమాను రూపొందించింది.

కంగనా స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆమె ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రూ. 60 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 21కోట్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల అంచనా.

Exit mobile version
Skip to toolbar