Site icon Prime9

Kamal Haasan: మరో అంతర్జాతీయ అవార్డును అందుకోనున్న కమల్ హాసన్

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan: విలక్షణ నటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నట విశ్వరూపంతో కొన్ని దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఇలా బహుముఖ ప్రజ్హాశాలిగా పేరు తెచ్చుకున్నారు కమలహాసన్. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ లాంటి పలు భాషల్లో దాదాపు 232 పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, రివార్డులు ఆయనకు దక్కాయి.

ఖాతాలో మరో అవార్డు(Kamal Haasan)

తాజాగా మరో అవార్డు ఆయన ఖాతాలో చేరనుంది. 6 దశాబ్ధాలుగా సినీ రంగానికి అందించిన సేవలకు గాను ఐఫా జీవిత కాల పురస్కారం ఆయనను వరించింది. ఈ నెల 27న అబుదాబిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (IIFA 2023) కార్యక్రమంలో కమలహాసన్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. కమల్ కు ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం రావడంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

త్వరలో ఇండియన్ 2 టీజర్

ప్రస్తుతం కమలహాసన్.. దర్శకుడు శంకర దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాను నటించిన సన్నివేశాలకు కమల్‌ డబ్బింగ్‌ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఇండియన్ 2 టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత కమల్ ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

Exit mobile version