Kalki 2898 AD: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
యూఎస్ఏ లో పెద్ద హిట్ ..(Kalki )
ఈ సినిమా పట్ల దేశంలోను,విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ నేపధ్యంలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఉత్తర అమెరికాలో $3 మిలియన్లు వసూలు చేసిన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల కోసం లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన మొదటి భారతీయ చిత్రం కూడా ఇదే. , ప్రీమియర్ విక్రయాలు $1.3 మిలియన్ల ఆల్-టైమ్ రికార్డ్‌ను తాకాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే, యూఎస్ఏ లో కల్కి అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
అడ్వాన్స్ సేల్స్‌ను బట్టి చూస్తే కల్కి మంచి వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నైజాంలో 35 కోట్లు సాధించి ఆర్‌ఆర్‌ఆర్ (రూ. 33 కోట్లు), సాలార్ (రూ. 32 కోట్లు) చిత్రాలను అధిగమించింది.. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భారతీయ సినిమాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, పశుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.