Site icon Prime9

Satyabhama Movie : పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కాజల్.. సత్యభామ టీజర్ రిలీజ్

kajal agarwal satyabhama movie teaser released

kajal agarwal satyabhama movie teaser released

Satyabhama Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ “కాజల్ అగర్వాల్” వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య భగవంత్ కేసరిలో ప్రధాన పాత్ర పోషించిన కాజల్.. ఆ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు తన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘స‌త్య‌భామ’ తో ఆడియన్స్ ముందుగు మళ్ళీ రాబోతుంది. అఖిల్ డేగల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో సీనియర్ హీరో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కాజల్ కెరీర్ లో 60వ మూవీగా తెరకెక్కుతుంది.

ఇక శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. జి విష్ణు కెమెరామెన్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా (Satyabhama Movie) 60 శాతం షూటింగ్ పూర్తి కాగా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లు, టైటిల్ లుక్ లు విడుదల చేయగా.. తాజాగా చిత్రబృందం మరో అప్ డేట్ బయటకు వదిలింది. దీపావళి పండుగ సందర్భంగా సత్యభామ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

ఇక టీజర్ గమనిస్తే..  క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమవుతుంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామ హ్యాండిల్ చేస్తున్న కేసులో అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడం, సత్యభామని ఆ కేసు నుంచి తొలిగించడం, కానీ తను వల్ల ఒక తప్పు జరిగిందన్న కోపంతో సత్యభామ.. ఆ కేసుని ఆఫ్ డ్యూటీలో ఇన్‌వెస్టిగేషన్ చేయడం సినిమా కథ అని తెలుస్తుంది.ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ సత్యభామగా కాజల్ వావ్ అనిపిస్తున్నారు. గతంలో విజయ్ “జిల్లా” సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. కానీ అందులో పవర్ ఫుల్ గా మాత్రం లేదు. కేవలం రొమాన్స్, పాటలకు మాత్రమే ఆమె క్యారెక్టర్ ను పరిమితం చేశారు. కానీ తొలిసారి ఫుల్ లెంత్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కాజల్ కనిపించనున్నారు. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని టీజర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. దీంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం టీజర్ వైరల్ గా మారింది.

 

Exit mobile version