Site icon Prime9

War 2: ‘వార్‌ 2’లో గాయపడ్డ స్టార్‌ హీరో.. షూటింగ్‌ వాయిదా?

War 2 Shooting Gets Postponed: బాలీవుడ్‌ ‘గ్రీక్‌ గాడ్‌’ హృతిక్ రోషన్, టాలీవుడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు బ్రేక్‌ పడేలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో స్టార్‌ హీరో గాయపడినట్టు తెలుస్తోంది. ‘వార్‌ 2’ కోసం నార్త్‌ ఆడియన్స్‌ మాత్రమే కాదు సౌత్‌ ఆడియన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌ వార్‌ 2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ

ఎన్టీఆర్‌ హిందీ డెబ్యూ మూవీ కావడంతో మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ షూటింగ్‌ చకచక జరుపుకుంటుండంతో త్వరలోనే వార్‌ 2 రిలీజ్‌ డేట్‌ వచ్చే అవకాశం ముందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని కాస్తా నిరాశ పరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. దాదాపు వార్‌ 2కి సంబంధించి యాక్షన్‌ సీక్వెన్స్‌ అయిపోయాట. ఎన్టీఆర్‌, హృతిక్ మధ్య ఓ సాంగ్‌ని డైరెక్టర్‌ అయాన్ ముఖేర్జీ ప్లాన్‌ చేశారట. ఈ పాట కోసం రిహార్సల్స్‌ చేస్తుండగా హృతిక్ రోషన్‌ గాలికి గాయమైనట్టు బాలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

500 మంది డ్యాన్సర్లు, భారీ సెట్

ఇది ఫైనల్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. ఈ పాటలో హృతిక్, ఎన్టీఆర్‌లతో పాటు 500 మంది డ్యాన్సర్స్‌ పాల్గొననున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ కూడా వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్‌ని నిలిపేవేశారని, ఆయన కోలుకునే వరకు వార్‌ 2 షూటింగ్‌కి వాయిదా పనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హృతిక్ విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆయనకు నెల రోజుల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.

ఆగష్టులో రిలీజ్?

దీంతో ‘వార్‌ 2’ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. నిజానికి ఇప్పటికే ‘వార్‌ 2’ రిలీజ్‌ డేట్‌ని ప్లాన్‌ చేసిందట మూవీ టీం. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ మూవీ విడుదల చేయాలని సన్నాహాలు చేసుకున్నారట. తాజా ఈ ఘటన వార్‌ 2 మూవీ ఆగష్టు వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. యష్‌రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాపు ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్‌ మూవీ వార్‌ కి సీక్వెల్‌గా వార్‌ 2ని తెరకెక్కిస్తున్నారు. ఇంఉదలో జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar