Site icon Prime9

Jr NTR: డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

jr ntr says dance is in our blood

jr ntr says dance is in our blood

Jr NTR: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డులను నెలకొల్పుతుంది. ముఖ్యంగా ఆ చిత్రంలోని నాటు నాటు సాంగ్ సిగ్నేచర్ స్టెప్పు మాత్రం ప్రపంచవ్యాప్త ప్రజానికాన్ని ఒక ఊపు ఊపిందనుకోంది. అయితే ఈ చిత్రం ఇటీవల జపాన్ లోనూ ప్రదర్శించబడుతున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం జపాన్ వెళ్లిందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అక్కడ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తారక్, చరణ్ లను చూసి జపనీస్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే పాటలకు జపనీస్ సైతం స్టెప్పులేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పుకైతే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము భారతీయులం ఎప్పుడూ డ్యాన్స్ గురించి ఫిర్యాదు చేయము. డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది. అందుకే భారతీయులు డ్యాన్స్ అంటే ఇష్టపడకుండా ఉండలేరు. డ్యాన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలంటే.. ముందు డ్యాన్స్ ను ప్రేమించడం నేర్చుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభుదేవా.. అతడిని ఇప్పటికీ ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. ” అంటూ తారక్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: కాంతార మూవీకి కోర్ట్ బిగ్ షాక్.. థియేటర్లలో నిలిపివేయాలంటూ ఆదేశం..!

Exit mobile version