Site icon Prime9

NTR-Neel: అడవిలో ఎన్టీఆర్‌,ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌ – తారక్‌ జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే!

Jr NTR Joins in Prashanth Neel Movie Set: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. కొరటాల శివతో దేవర, హిందీలో వార్‌ 2తో పాటు ప్రశాంత్‌ నీల్‌తో డ్రాగన్‌ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే దేవర పార్ట్‌ 1 విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దుమ్ముదులిపింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పార్ట్‌ 2 షూటింగ్ పునులు మొదలుకాన్నాయి. దేవరతో పాటు వార్‌ 2 షూటింగ్‌ని కూడా గతేడాది మొదలు పట్టాడు.

ప్రస్తుతం వార్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్‌ త్వరలోనే ప్రశాంత్‌ నీల్‌ మూవీ సెట్లో అడుగుపెట్టబోతున్నాడట. గతేడాది ఈ చిత్రం పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. కానీ, ఇంకా రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు కాలేదు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకున్న ఈ సినిమా ఈ నెల చివరిలో ఫస్ట్ షెడ్యూల్‌ని మొదలుపెట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌తో స్పెషల్‌ సెట్‌ను రెడీ చేశారట. ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ అక్కడే జరగనుందట.

అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌ పాల్గొనకపోవచ్చని, నెక్ట్స్‌ మార్చి షెడ్యూల్‌ నుంచి సెట్లో జాయిన్‌ అవువతాడని సినీవర్గాల నుంచి సమాచారం. మార్చిలో జరిగే సెకండ్‌ షెడ్యూల్‌ను రంగారెడ్డి జిల్లా వికారబాద్‌ అడవుల్లో జరుగుతుందని టాక్‌. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ జరగనుందని, ఇందులో ఎన్టీఆర్‌ పాల్గొననున్నాడని సినీవర్గాల నుంచి సమాచారం. పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు.

ఓల్డ్ కలకత్తా డ్రాగ్స్‌ మాఫీయా నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందట. ఇందులో చైనా ఇన్వాల్మెంట్‌ కూడా ఉండనుండటంతో ఈ సినిమాకు డ్రాగన్‌ అనే పేరును పరిశీలిస్తున్నాడట ప్రశాంత్ నీల్‌. కేజీయఫ్‌, సలార్‌లాగే డ్రాగన్‌ మూవీ కూడా డార్క్‌ థీమ్‌లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్‌ నీల్. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ బ్యానర్‌లో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమానే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version
Skip to toolbar