Site icon Prime9

NTR : జూనియర్ ఎన్టీఆర్ ని స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన వెరైటీ మ్యాగజైన్…

jr ntr interview with variety magazine pics goes viral

jr ntr interview with variety magazine pics goes viral

NTR : ప్రపంచ వ్యాప్తంగా RRR సృష్టించిన సంచలనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 10 నెలలు కావొస్తున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. తాజాగా వరల్డ్ ఫేమస్ వెబ్సైటు వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన ఆస్కార్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ “టాప్ 10 ప్రిడిక్షన్ లిస్ట్ లో” ఎన్టీఆర్ పేరు ఉండటంతో అభిమానుల అనడానికి హద్దు లేకుండా పోతుంది. మిన్నంటిన సంబరాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

ట్విట్టర్ లో ( #NTRGoesGlobal ) అనే హాష్ టాగ్ తో టాప్ ట్రేండింగ్ లో పెట్టేసారు నందమూరి అభిమానులు. కాగా లాస్ ఏంజిల్స్ వెరైటీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ క్లేటన్ డావిస్ ఎన్టీఆర్ తో చేసిన స్పెషల్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు జనవరి 9న TCL చైనా థియేటర్ లో జరగనున్న స్పెషల్ స్క్రీనింగ్ కి ఎన్టీఆర్ హాజరు కావడం తో ఏం మాట్లాడతాడా అని ఫాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ ఏమి లేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా తమ హీరో కి దక్కుతున్న ఆదరణ, ఇప్పుడు తాజాగా ఆస్కార్ ప్రిడిక్షన్ టాప్ 10 లిస్ట్ పేరు ఉండటం తో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు..

 

Exit mobile version