Jr Ntr : ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి. సదరు ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ యూనిట్ పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ యూనిట్ లో ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. అన్నయ్య తారకరత్న అకాల మరణం కారణంగా ఎన్టీఆర్ ఇండియాలోనే ఉండిపోయారు. మార్చి 2న తారకరత్న పెద్దకర్మ ముగిసిన నేపథ్యంలో 6న ఎన్టీఆర్ బయలుదేరి అమెరికా వెళ్లారు. ఈ తరుణంలోనే అమెరికా వెళ్ళాక ఎన్టీఆర్ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన బాల్కనీలో నిల్చుని నగరం వైపు చూస్తున్నట్లున్న ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. ఆయన టీ షర్ట్ వెనుక టైగర్ సింబల్ ఉంది. బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో ఉన్నట్టు తెలిపాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.
మనది రక్త సంబంధం కంటే చాలా పెద్ద బంధం – ఎన్టీఆర్ (Jr Ntr)
అలానే కాలిఫోర్నియాలో అభిమానులతో తారక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పారు. ”మీరు చూపించే అభిమానానికి నా మనసులో మాట చెప్పడానికి తెలుగులో పెద్ద పదం కనిపించడం లేదు. మీరు నాకు ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. అంత కంటే ప్రేమ లోపల (గుండెల్లో) దాగి ఉంది. నేను చూపించలేకపోతున్నాను. లెక్క ప్రకారం అయితే నేను కింద కూర్చోవాలి. అభిమానులు అందరూ పైన ఉండాలి” అని ఎన్టీఆర్ చెప్పారు. నేను ఏం చేసి మీకు ఇంత దగ్గర అయ్యానో నాకూ తెలియదు. మనది రక్త సంబంధం కంటే చాలా పెద్ద బంధం” అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
‘మీరు మా బ్రదర్ అన్నయ్యా’ అని ఓ అభిమాని అంటే… ”మీరు అందరూ నా బ్రదర్స్” అని ఎన్టీఆర్ బదులు ఇచ్చారు. అభిమానులు అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానని ఆయన అన్నారు. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాని భావోద్వేగానికి లోనయ్యారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
కాగా మరోవైపు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు విశిష్ట అతిథిగా చరణ్ హాజరయ్యారు. తన చేతుల మీదుగా ఓ అవార్డు ప్రదానం చేశారు. అలాగే స్పాట్ లైట్ అవార్డుతో గౌరవించబడ్డారు. HCA ఎన్టీఆర్ ని సైతం ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్ ఇండియాలో ఉండిపోవడంతో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయారు. ఇక ఎన్టీఆర్ ని అవార్డుకు ఎంపిక చేయడంతో పాటు త్వరలో ఆయనకు అందజేయనున్నట్లు తెలియజేశారు.
Young tiger in-town 😍#JrNTR #RRRMoive pic.twitter.com/pS2FeDNkkr
— Vivek chava (@chavanithin6) March 7, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/