Prime9

John Say : క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’

Tollywood News: ప్రస్తుతం కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో, డిఫరెంట్ కాన్సెప్టు తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు.

 

క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న జాన్ సే లో యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఆకట్టుకునే లవ్ స్టొరీతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో పూర్తి షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ చిత్రాన్ని రూ 10 కోట్ల బడ్జెట్ తో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. జాన్ సే చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version
Skip to toolbar