Jani Master: జానీ మాస్టర్‌ మరో షాక్‌ – డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తొలగింపు

  • Written By:
  • Updated On - December 9, 2024 / 02:06 PM IST

A Shock to Jani Master: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారట. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ డ్యాన్సర్‌ అండ్‌ డ్యాన్స్ డైరెక్టర్‌ అసోసియేషన్‌కి ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో జోసెఫ్‌ ప్రకాశ్‌ భారీ మెజారిటీతో గెలిచాడు. దీంతో ఆయన డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా జోసెఫ్‌ ప్రకాశ్‌ 5వ సారి ఎన్నికయ్యారు.

అంతకు ముందు డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కి జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్‌ వైదోలిగాడు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవి ఎన్నిక జరగగా.. జోసెఫ్ ప్రకాశ్‌ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈ ఎన్నికలపై జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగించినట్టు ప్రచారం జరుగుతుంది.

మరి దీనిపై క్లారిటీ రావాలంటే అసోసియేషన్‌ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా జానీ మాస్టర్‌ గత సెప్టెంబర్‌లో మహిళా కొరియోగ్రాఫర్‌ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢి షో కంటెస్టెంట్‌గా చేసిన ఆమెకు జానీ మాస్టర్‌ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా జానీ మాస్టర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు బాధిత మువతి రాచకోండ పోలీసులను ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.