Site icon Prime9

Jani Master: జానీ మాస్టర్ హీరోగా యథా రాజా తథా ప్రజ

Tollywood: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో 150 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించాడు. లేటెస్ట్‌గా రాబోయే సినిమాతో హీరోగా మారాడు. యథా రాజా తథా ప్రజ అనే టైటిల్‌ తో జానీ మాస్టర్ కొత్త చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. హీరో శర్వానంద్ స్క్రిప్ట్ అందజేసి క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌ను ద్రోణ చిత్ర దర్శకుడు జె.కరుణ్ కుమార్ తెరకెక్కించారు.

శ్రీనివాస్ విట్టాల రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సినిమా బండి ఫేమ్ వికాస్, శ్రస్తి వర్మ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఓం మూవీ క్రియేషన్స్ & శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ పతాకం పై హరేష్ పటేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version