NTR In Oscar: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘RRR’ దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల నామినేషన్లలో లిస్ట్ అయింది. రాజమౌళి కూడా NYFCCలో ప్రతిష్టాత్మకమైన ‘ఉత్తమ దర్శకుడు’ అందుకున్నారు. ఇప్పుడు, ఆస్కార్ 2023కి సంబంధించి టాప్ టెన్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్‌లో చోటు దక్కించుకున్న ఎన్టీఆర్ కూడా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
ఎన్టీఆర్ వెరైటీ మ్యాగజైన్ యొక్క ఆస్కార్ ఉత్తమ నటులు 2023 అంచనాల జాబితాలోకి చేరారు. ఇందులో విల్ స్మిత్, హ్యూ జాక్‌మన్, ఆస్టిన్ బట్లర్ మరియు మరెన్నో గొప్ప నటులు కూడా ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం, భారతీయ నటుడు అత్యంత గౌరవనీయమైన అవార్డు కోసం ఉత్తమ నటులలో 10వ స్థానాన్ని పొందాడు. భారతీయ చరిత్రలో ఒక భారతీయ నటుడు టాప్ 10 ఆస్కార్ అంచనాల జాబితాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ పత్రిక అంచనాల జాబితాలో ఎస్ఎస్ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా చేర్చింది.ఇది ఎన్టీఆర్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
ఆస్కార్‌గా పిలవబడే అకాడమీ అవార్డులు హాలీవుడ్‌లో చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాత్మక అవార్డుల వేడుక. జనవరి 12 నుంచి 17 వరకూ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు అకాడమీ బృందం ఓటింగ్ నిర్వహించబోతోంది. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12వ తేదీన ప్రేక్షకులను అలరించిన విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు డాల్బీ థియేటర్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.