Site icon Prime9

War 2 : యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నా.. మిత్రమా – ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ స్పెషల్ విషెస్ !

interesting update on ntr and hrithik roshan war 2

interesting update on ntr and hrithik roshan war 2

War 2 : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఎన్టీఆర్. జపాన్ , అమెరికాలో కూడా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో తారక్ చేసే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా.. బాలీవుడ్ బ్యూటీ “జాన్వీ కపూర్” ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లు అన్నీ ఇప్పుడు నిజం అనిపించేలా ఓ ఘటన చోటు చేసుకుంది.  ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

హృతిక్ తన ట్వీట్ లో.. హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంవత్సరం ఆనందంగా, యాక్షన్ గా ఉండాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను, పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అని రాశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో కచ్చితంగా నటించబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సూపర్ అప్డేట్ ఇచ్చారని హృతిక్ కు థ్యాంక్స్ చెప్తున్నారు.

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సూపర్ హిట్ వార్ సినిమాకు వార్ 2 సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై చిత్రాలలో వార్ 2 తెరకెక్కబోతుంది. ‘వార్’ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, ‘వార్ 2’కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక – నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారని సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి హిట్ గా నిలిచింది.

 

Exit mobile version