Site icon Prime9

Director Rajamouli : అలా చేయమని రిక్వస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా – పాకిస్థాన్ పర్మిషన్ ఇవ్వలేదన్న జక్కన్న.. అసలు ఏం జరిగిందంటే ?

interesting tweets between anand mahindra and ss rajamouli

interesting tweets between anand mahindra and ss rajamouli

Director Rajamouli : మన దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త‌ల‌లో ఆనంద్ మ‌హీంద్ర కూడా ఒక‌రు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ట‌చ్‌లో ఉంటారు. తాజాగా మ‌రోసారి ఆయన చేసిన ట్వీట్ ఫుల్ గా వైర‌ల్ అవుతుంది. ఆ ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘మ‌న సంస్కృతి మ‌న‌కు గుర్తుకు తెచ్చే వాటిలో ఇలాంటివి ఉదాహ‌ర‌ణలుగా ఉంటాయి. మ‌న నాగ‌రిక‌త‌ను తెలియ‌జేసేలా అప్ప‌టి కాలానికి సంబంధించిన‌ట్లు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఓ సినిమాను చేయాల‌ని కోరుకుంటున్నాను. దీని వ‌ల్ల మ‌న పూర్వీకుల నాగ‌రిక‌త అవ‌గ‌త‌మ‌వుతుంది’’ అని తెలిపారు.

ఇప్పుడు తాజాగాఆ ఆయ‌న వేసిన ట్వీట్‌కు రాజ‌మౌళి స్పందించారు. ‘‘అలాగే సర్.. నేను ధోలా విర ప్రాంతంలో మ‌గ‌ధీర చిత్రాన్ని షూట్ చేస్తున‌ప్పుడు ఒక చెట్టుని గ‌మ‌నించాను. అది శిలాజంగా మారిపోయింది. సింధులోయ సంస్కృతి నాగ‌రిక‌త గురించి ఆ చెట్టు క‌థ చెబుతున్న‌ట్లు సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. కొన్ని సంవత్స‌రాల త‌ర్వాత పాకిస్థాన్‌కు సంద‌ర్శించాను. మెహంజ‌దారో ప్రాంతాన్ని చూడాల‌ని చాలా గట్టిగా ప్ర‌య‌త్నించాను. బాధాక‌ర‌మైన విష‌య‌మేమంటే పాకిస్థాన్ వాళ్లు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు అని శాడ్ ఎమోజీ ఒకటి పెట్టారు.

 

రాజమౌళి (Director Rajamouli) – సూపర్ స్టార్ మహేష్ మూవీ ఎప్పుడంటే..

రాజమౌళి ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కె.ఎల్‌.నారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అడ్వెంచ‌ర‌స్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా ఉంటుంద‌ని ఇప్ప‌టికే జ‌క్క‌న్న అండ్ టీమ్ ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాదిలో ఈ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇందులో ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు కూడా న‌టించ‌బోతున్నట్లు సమాచారం అందుతుంది.

ఇక దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు. ఈ మూవీ ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Exit mobile version