Site icon Prime9

Nadamuri Balakrishna : ఆ రికార్డు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా బాలయ్య రికార్డు.. చిరు, నాగ్, వెంకీ లకు కూడా సాధ్యం కాలేదుగా !

interesting news about hero nandamuri balakrishna

interesting news about hero nandamuri balakrishna

Nadamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. తనదైన శైలిలో దూసుకుపోతూ అటు హీరోగా.. ఇటు వ్యాఖ్యాతగా దుమ్ము దులుపుతున్నారు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాకే నటనకు ప్రశంసలు అందుకున్నారు బాలయ్య. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఓ వైపు అగ్రకథానాయకుడిగా కొనసాగుతూనే.. మరోవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన అగ్ర కథానాయకుడు అంటే మన బాలయ్యే అని చెప్పవచ్చు.

ఇక ఇన్నేళ్ల సుధీర్ఘ సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఒక్క రీమేక్ చిత్రంలో కూడా బాలయ్య నటించకపోవడం గమనార్హం. ఆ ఘనత సాధించిన ఏకైక సీనియర్ హీరోగా బాలకృష్ణ రికార్డు నెలకొల్పారు. అలాగే అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించిన హీరోగా కూడా బాలయ్యకు రికార్డ్ ఉంది. దాదాపు ఆయన 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ ప్లే చేయగా.. అధినాయకుడు సినిమాలో త్రిపాత్రాభినయంతో మెప్పించారు. అలాగే 1987లో బాలయ్య సినిమాలు 8 విడుదలవడం ఓ విశేషమైతే.. అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం మరో విశేషం. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో నటించిన హిస్టరీ ఆయనకే సొంతం. అలాగే తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించారు.

తాతమ్మ కల సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా తొలి చిత్రానికే నటనకు ప్రశంసలు అందుకున్నారు. బాలకృష్ణ ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నేడు బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి విశేష స్పందన లభిస్తుంది.

మరోవైపు బాబీ దర్శకత్వంలో  109 వ మూవీని ఈరోజు ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ రానుంది.

 

Exit mobile version
Skip to toolbar