Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన “పుష్ప” సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా లీకులు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటున్నాయి.
రష్మిక వైరల్ పిక్ లో ఉన్నది ఎవరంటే..? (Pushpa 2)
అయితే ఇప్పుడు తాజాగా పుష్ప-2లో రష్మిక చనిపోయిందంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి రష్మిక చనిపోయినట్లు ఉన్న ఓ ఫోటో కూడా చక్కర్లు కొడుతుంది. దీంతో రష్మిక ఈ సినిమాలో చనిపోతుందా ? అందుకే సెకండ్ హీరోయిన్‌ను తీసుకుంటున్నారా అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అసలు విషయానికి వస్తే ఆ ఫోటో అసలు పుష్ప-2లోది కాదు అని తేలింది. ఓ మరాఠీ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్ అని.. ఆ ఫోటోలు కూడా ఉన్నది రష్మిక కాదని వేరే హీరోయిన్ అని తేల్చేశారు. ఈషా దివేకర్ నటించిన ఆ సినిమాలో సీన్ లో ఆమె కొంచెం రష్మికని పోలి ఉండడంతో అలా అందరూ పొరబడినట్లు అర్ధం అవుతుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ అంతా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఈ మూవీతో దక్షిణాది లోనే కాకుండా ఉత్తరాది లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది. గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మికకు… ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన “మిషన్ మజ్ను” మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
పుష్ప ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.