Site icon Prime9

Nani 30 : నానికి జోడీగా “మృణాల్ ఠాకూర్” ఫిక్స్ అయ్యిందా… కొత్త మూవీ డైరెక్టర్ ఎవరంటే?

interesting details about natural star nani 30th movie

interesting details about natural star nani 30th movie

Nani 30 : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పాలి. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి చిత్రాలతో వరుస హిట్లను అందుకున్న ఈ హీరో.. ప్రొడ్యూసర్ గా కూడా ఇటీవలే హిట్ 2 తో సక్సెస్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమాలో నాని నటిస్తున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ క్రమంలోనే నాని నెక్స్ట్ సినిమాలపై ఆయన ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలోనే హిట్ 2 లో హిట్ 3 గురించి చెప్పి… నేకక్షత సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు నాని.

కాగా శుక్రవారం నాడు తన 30 వ చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను న్యూ ఇయర్ కానుకగా జనవరై 1 వ తేదీ వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న హీరోయిన్ గురించి సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. నాని అప్ కమింగ్ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. బాలీవుడ్ లో పలు సీరియళ్ళు, సినిమాలు చేసినా మృణాల్ కి అంత గుర్తింపు రాలేదని చెప్పాలి. కానీ ఈ ఒక్క మూవీలో తన యాక్టింగ్ తో, అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

దీంతో ఈమె నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లోనే మృణాల్… నానితో రొమాన్స్ చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే మృణాల్ నటిస్తే, నానితో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని నాని, మృణాల్‌ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను శౌర్య అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మూవీపై పూర్తి వివరాలు తెలియాలంటే జనవరి 1న వరకు ఆగక తప్పదు.

Exit mobile version