Site icon Prime9

Simhadri Re Release : థియేటర్స్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ “సింహాద్రి”.. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ ? మూవీ చూసిన ప్రముఖులు ఎవరంటే ??

interesting details about jr ntr simhadri re release

interesting details about jr ntr simhadri re release

Simhadri Re Release : రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా సాధించాయి. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సింహాద్రి’ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక హీరోయిన్స్ గా నటించారు. నాజర్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, భానుచందర్ కీలకపాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం 2023 లో విడుదలైన, సుమారు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది.

అయితే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సింహాద్రి’ రీ రిలీజ్ కి 1200 పైగా షోలు వేయనున్నారు. అంతే కాకుండా ఈ రి రిలీజ్ కి కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పటి వరకు ఓ రీ రిలీజ్ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే తొలిసారి. ఈ రికార్డ్ కేవలం ఎన్టీఆర్ ‘సింహాద్రి’ మూవీకి మాత్రమే దక్కింది అని చెప్పాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి సినిమాని పలు థియేటర్స్ లో షోలు వేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో సింహాద్రి సినిమాను చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సింహాద్రి రీ రిలీజ్ చూడటానికి వస్తున్నారు. సింహాద్రి దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ కూడా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనే సుమారు 150 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా 1210 షో లలో మూవీని ప్రదర్శించనున్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ అయిన మెల్ బోర్న్ ఐమాక్స్ థియేటర్ లోనూ ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగింది. ఈ సినిమా రి రిలీజ్ కు వచ్చిన కలెక్షన్స్ లోని లాభాలను పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అందించబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు ఈ సాయం అందనుంది.

మరోవైపు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్స్ లో సింహాద్రి రీ రిలీజ్ షో వేశారు. ఈ స్పెషల్ షోకి డైరెక్టర్ రాజమౌళి భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తీకేయ, కీరవాణి భార్య, కీరవాణి తనయుడు, పలువురు ఫ్యామిలీ మెంబర్స్ కూడా విచ్చేసి అభిమనుల మధ్య కూర్చొని సినిమా చూశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. అలానే బాలీవుడ్ లోకి కూడా ‘వార్ 2‘ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

 

 

Exit mobile version