Kushboo Sundar: నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల వయసులోనే తాను తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు తాజాగా వెల్లడించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
8 ఏళ్లకే లైంగిక వేధింపులు.. (Kushboo Sundar)
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని తన ఆవేదనన చెప్పుకొచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాజాగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలోనే ఒక అబ్బాయి లేదా అమ్మాయి వేధింపులకు గురైతే.. ఆ భయం వాళ్లను జీవితాంతం వెంటాడుతుందని తెలిపారు. భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం.. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటం జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో అనేక ఇబ్బందులు పడిందని తెలిపింది.
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందించారు. చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని బయటపెట్టారు. ఎనిమిదేళ్ల వయసులోనే దారుణమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఇదే విషయాన్ని మా అమ్మకు చెబితే నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డానని ఆ కార్యక్రమంలో తెలిపింది. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం అని ఖుష్బూ వివరించారు.
ఇటీవలే జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నియమితులయ్యారు. మహిళలపై ఇప్పటికి లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆమె భావిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.