Site icon Prime9

Hunt Telugu Movie: సుధీర్ బాబు సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు

Hunt

Hunt

Tollywood News: సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. ‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.

గతంలో మార్వెల్ ఫ్రాంచైజీతో సహా పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో పనిచేసిన రెనాడ్ ఫావెరో మరియు బ్రియాన్ విజియర్ ఇప్పుడు హంట్‌ కు పనిచేసారు. సుధీర్ బాబు నటించిన సినిమా కోసం వారు కొన్ని యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసారు. వారు ఇటీవల జాన్ విక్ 4 కోసం పనిచేశారు.ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత వి ఆనందప్రసాద్‌ ధృవీకరించారు. రెనాడ్ ఫావెరో మరియు బ్రియాన్ విజియర్ ఇద్దరు టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు. వారు రాబోయే జాన్ విక్ 4లో కూడా పనిచేశారు.

వారి యాక్షన్ కొరియోగ్రఫీ హంట్ కు ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ యాక్ష‌న‌్ సీన్స్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో హంట్ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అన్నారు.సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు.

Exit mobile version