Site icon Prime9

Jason David Frank Suicide: పవర్ రేంజర్స్ నటుడు మృతి.. ఆత్మహత్య చేసుకున్న గ్రీన్ రేంజర్

power-rangers-fame-jason-david-frank-suicide at america

power-rangers-fame-jason-david-frank-suicide at America

Jason David Frank Suicide: పవర్ రేంజర్స్ సిరీస్‌లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఇకలేరు. పవర్ రేంజర్‌ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అందులోనూ గ్రీన్ రేంజర్‌గా ఎంట్రీ ఇచ్చి వైట్ రేంజర్‌గా మారి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జాసన్ డేవివ్ ఫ్రాంక్. తన నటనతో 90వ దశకంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు డేవిడ్ ఫ్రాంక్. టమీ ఓలివర్ పాత్రలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు డేవిడ్. అలాంటి డేవిడ్ నిన్న ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఆయన మృతి వార్త విని అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు.

అమెరికాలోని టెక్సాస్‌లో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అసలు డేవిడ్ కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అభిమానులు అయోమయంలో ఉన్నారు. పవర్ రేంజర్స్ వైల్డ్ ఫోర్స్, టర్బో, జియో, డినో థండర్, మెగాఫోర్స్, నింజా స్టీల్, హైపర్ ఫోర్స్ వంటి వాటిల్లోనూ జాసన్ అదరగొట్టేశాడు. రెడ్ రేంజర్, బ్లాక్ రేంజర్, గ్రీన్ రేంజర్‌గానూ ప్రజలను మెప్పించాడు. అందుకే పవర్ రేంజర్స్‌లో జాసన్ అందరికీ ఫేవరేట్ అయ్యాడు. ఇక జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మృతిపై పలువురు నటులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదీ చదవండి: దర్శకుడు మదన్ హఠాన్మరణం!

Exit mobile version