Site icon Prime9

Black panther Wakanda Forever: సరికొత్తగా “బ్లాక్ పాంథర్” వచ్చేస్తుంది.. నవంబర్ 11న “వకాండా ఫరెవర్” సందడి

black panther wakanda forever movie review

black panther wakanda forever movie review

Black panther Wakanda Forever: మార్వెల్ స్టూడియోస్ సమర్పణలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ పాంథర్ మూవీ అందరికీ సుపరిచితే. హాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలలో ఈ సినిమా అఖండ విజయం సాధించిందని చెప్పవచ్చు. కాగా చాడ్విక్ బోస్‌మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు స్వీక్వల్ అయిన బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే దీపావళి సందర్భంగా మార్వెల్ ఇండియా శుక్రవారం ఒక ప్రకటన చేసింది. “బ్రేకింగ్ న్యూస్: వాకండా మరోసారి ప్రపంచానికి తలుపులు తెరిచింది! మార్వెల్ స్టూడియోస్ యొక్క బ్లాక్ పాంథర్ #WakandaForever కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు తెరవబడింది. అంటూ రాసుకొచ్చింది. అయితే నవంబర్ 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా భారతదేశంలో రెండు వారాల ముందే ఈ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇటీవల, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ బ్లాక్ పాంథర్ సీక్వెల్ యొక్క అసలు స్క్రిప్ట్ ఎలా ఉందో మరియు చాడ్విక్ బోస్‌మాన్ కోసం ఎలా వ్రాయబడిందో  మీడియాతో చర్చించారు. అయితే చాడ్విక్ క్యాన్సర్తో 2020లో మరణించిన తరువాత, బ్లాక్ పాంథర్‌ స్క్రిప్ట్‌ను తిరిగి రాశారు. “చాడ్విక్ మరణానికి ముందు తాము టి’చల్లా దృక్పథంలోనే స్క్రిప్ట్ రాశామని దర్శనకుడు ర్యాన్ కూగ్లర్ అన్నారు.

ఈ భారీ తరహా యాక్షన్-అడ్వెంచర్‌ మూవీకి ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించగా, లెటిటియా రైట్, ఏంజెలా బాసెట్, టెనోచ్ హుర్టా మెజియా, విన్‌స్టన్ డ్యూక్, డానై గురిరా, లుపిటా న్యోంగో, ఫ్లోరెన్స్ కసుంబా మరియు మార్టిన్ ఫ్రీమాన్ తదితర హాలీవుడ్ తారాగణం ప్రముఖ పాత్రలలో నటించారు. 2 గంటల 41 నిమిషాల నిడివగ ఈ బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ చిత్రాన్ని బ్లాక్ పాంథర్ మూవీ సీక్వెల్స్ లో ఒకటిగా తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నవంబర్ 11, 2022న థియేటర్లలో సందడి చెయ్యనుంది.

ఇదీ చదవండి: దీపావళి క్రాకర్‌లా “ధమాకా” టీజర్.. ఫుల్ ఎనర్జీతో రవితేజ..!

Exit mobile version