Poonam Kaur has a rare disease: హీరోయిన్ పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి

fibromyalgia: హీరోయిన్ పూనమ్ కౌర్‌ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్‌ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 07:44 PM IST

Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్‌ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్‌ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైబ్రో మైయాల్జియా వ్యాధితో నిద్ర లేమి, అలసట.. కండరాల నొప్పి, మానసిక సమస్యలతో పూనమ్ బాధపడుతోంది. రెండేళ్లుగా ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నా.. ఫలితం ఉండటం లేదు. దీంతో కేరళలో ఆయుర్వే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాను చికిత్స పొందుతున్న ఫోటోలను పూనమ్ కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, నిద్ర లేమి, త్వరగా అలసిపోవడం, కండరాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి రుగ్మతలు సోకుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

పూనమ్ కౌర్ సుమారు రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నట్టు సమాచారం. తగిన మందులు వాడుతూ, మానసిక ప్రశాంతతను పొందుతూ..క్రమం తప్పకుండా యోగా చేసిన పక్షంలో ఈ వ్యాధి నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.