Prime9

War 2 Teaser Out: ఎన్టీఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.. అదిరిపోయిన ‘వార్‌ 2′ టీజర్‌’, తారక్ లుక్ మామూలుగా లేదు..!

Jr NTR and Hrithik Roshan War 2 Official Teaser: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ‘వార్‌ 2’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ రానుందని హృతిక్ రోషన్ అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో అంతా ఇది వార్‌ 2 టీజర్‌ అయ్యింటుందని అంచనాలు వేసుకున్నారు. అనుకున్నట్టుగానే తాజాగా ‘వార్‌ 2’ టీజర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. హృతిక్ రోషన్ ఈ టీజర్‌ ఎవరీ ఊహకు అందనంతగా యాక్షన్‌, థ్రిల్లర్‌తో ఆకట్టుకుంది. ఇందులో తారక్‌, హృతిక్ మధ్య వార్‌కి థియేటర్లు దద్దరిళ్లడం ఖాయం అనేట్టుగా ఉంది.

టీజర్‌ విషయానికి వస్తే..

”నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్. రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే. కానీ, ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలియదు. కానీ, ఇప్పుడు తెలుసుకుంటావ్. గెట్ రెడీ ఫర్ వార్” అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్‌ తెప్పేంచేలా ఉన్నాయి. ఇక విజువల్స్‌ అయితే వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ ఎప్పుడు చూడని స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. ఇందులో హృతిక్ రోషన్‌కి వార్‌లో, లుక్‌లో ఏమాత్రం తీసిపోకుండ సూపర్‌ లుక్‌లో కనిపించాడు.

 

మొత్తానికి ఎన్టీఆర్ వార్‌ 2తో ఫ్యాన్స్‌ ట్రీట్‌ ఫిస్ట్‌ ఇచ్చింది యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌. కాగా ఇది తారక్‌కు బాలీవుడ్‌ డెబ్యూ మూవీ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉంటుంది, తారక్‌ ఏ పాత్రలో చేయబోతున్నాడా? అని ఫ్యాన్స్‌ క్యూరియాసిటీ నెలకొంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ వార్‌ మూవీకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. హృతిక్, జాకీ ష్రాఫ్‌లు నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో తారక్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా కనిపించడనున్నాడని సమాచారం.

 

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘వార్ 2’ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. హృతిక్ రోషన్ సరసన ఆమె జతకట్టబోతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 14న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

 

WAR 2 Official Teaser | Telugu | Hrithik Roshan, NTR, Kiara Advani | Ayan Mukerji | YRF Spy Universe

Exit mobile version
Skip to toolbar