Site icon Prime9

Hamsa Nandini : కేన్సర్ ను ఓడించి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ” మిర్చి ” బ్యూటీ

hamsa-nandini-cured-from-breast-cancer-and-participated-in-shooting

hamsa-nandini-cured-from-breast-cancer-and-participated-in-shooting

Hamsa Nandini : ప్రముఖ నటి హంస నందిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటవుదాం అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఆ తర్వాత దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘అనుమానాస్పదం’ అనే చిత్రంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి’ సాంగ్ లో నందిని అదరగొట్టింది. ఇక ఆ తర్వాత తెలుగులో పలు వరుస ఆఫర్లను దక్కించుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన ‘పంతం’ సినిమాలో నటించిన హంస నందిని… ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా గత ఏడాది డిసెంబర్ లో తాను బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకొని ధైర్యం చెబుతూ కామెంట్లు చేశారు. కాగా దాదాపు సంవత్సరం పాటు కాన్సర్ తో పోరాడిని హంస నందిని… తాజాగా కేన్సర్ నుంచి పూర్తిగా కొలుకున్నట్లు తెలుస్తుంది.

మళ్ళీ తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేస్తూ… “నా కో స్టార్స్ ని, సినిమా ప్రపంచాని చాలా మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమా సెట్ లోకి అడుగుపెట్టడం పునర్జన్మలా ఉంది అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Exit mobile version