Site icon Prime9

Ramabanam Movie : హ్యాట్రిక్ హిట్ టార్గెట్ గా గోపీచంద్ – శ్రీవాస్.. రామబాణం ట్రైలర్ రిలీజ్

gopichand and srivas ramabanam movie trailer released

gopichand and srivas ramabanam movie trailer released

Ramabanam Movie : మ్యాచో స్టార్ గోపీచంద్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గురించి పొందాడు. ‘తొలివలపు’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో. ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ రోల్ లో నటించి.. మెప్పించాడు. ఆ సినిమాల్లో తన నటనతో గోపీచంద్ ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత విలన్ పాత్రలకు పూర్తిగా చెక్ పెట్టి రణం, యజ్ఞం వంటి సినిమాలతో హీరోగా మారి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగలిగాడు. ఇక లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత యాక్షన్ హీరో గా  గోపీచంద్ కి మంచి గుర్తింపు లభించింది.

ఇక ఇప్పుడు డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘రామబాణం’. అంతకు ముందు వీరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం చిత్రాలు రాగా అవి మంచి హిట్ లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది. అనూహ్యంగా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసింది మన బాలయ్య బాబే. అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ తో కలిసి గోపీచంద్ కలిసి పాల్గొన్నప్పుడు బాలయ్య ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించగా.. తరుణ్ రాజ్ అరోరా విలన్ గా నటిస్తున్నారు.  మే 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన “రామబాణం”..

ఈ క్రమంలో ట్రైలర్ ని గమనిస్తే ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఉన్న కంప్లీట్ ఎంటర్ టైనర్ లా కనిపిస్తుంది. మంచి ఆహారం, మంచి బంధాలు అనే సందేశాన్ని కూడా ఇస్తున్నారని అర్దం అవుతుంది. ముఖ్యంగా ‘నేను హైవే లో డేంజర్ జోన్ బోర్డు లాంటోడిని.. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గకపోతే చావు వెతుక్కుంతూ వస్తుంది’ అని గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. అలాగే ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ అని జగపతి బాబు చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దుమ్ము లేపుతుంది. డింపుల్ హయతి కూడా అందం, అభినయంతో అదరగొడుతుంది.  వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి కామెడీతో సందడి చేస్తున్నారు. ఓవరాల్ గా రామబాణం ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండింగ్ గా మారింది. చూడాలి మరి శ్రీవాస్ – గోపీచంద్ హ్యాట్రిక్ కొడతారా ? లేదా అని??

 

Exit mobile version