Site icon Prime9

Game Changer: రేపే మూవీ రిలీజ్‌ – గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో సాంగ్‌ రిలీజ్‌

Game Changer Unpredictable Song: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ రేపు (జనవరి 10) విడుదల కానుంది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మొదటి నుంచి మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఇప్పటికే ఈచిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌, సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌ మరింత బజ్‌ పెంచాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ఆరు పాటలు రిలీజ్‌ చేశారు. తాజాగా ఏడో పాటను కూడా విడుదల చేసింది మూవీ టీం. రేపే మూవీ విడుదల ఉండగా.. అన్‌ప్రెడిక్టబుల్‌ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. ఇది సినిమా బ్యాగ్రౌండ్‌ వచ్చే సాంగ్‌ అని తెలుస్తోంది. ఇందులో చరణ్‌ ఐఏస్‌ అధికారిక స్టైలిష్‌గా కనిపించాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుంది.

Unpredictable - Lyrical Video | Game Changer | Ram Charan, Kiara Advani | Thaman S | Shankar

ఇందులో చరణ్‌ డ్యుయెల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఒకటి తండ్రి పాత్ర కాగా మరోకటి కొడుకు పాత్ర. ఇందులో తెలుగమ్మాయి అంజలి మరో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. తమిళ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని నవీన్‌ చంద్రతో పాటు పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ త్రీ షేడ్స్‌లో కనిపించబోతున్నాడని డైరెక్టర్‌ శంకర్‌ చెప్పారు. దీంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అశ్విన్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

Exit mobile version
Skip to toolbar