Site icon Prime9

Game Changer: పోలీసులను ఆశ్రయించిన గేమ్ ఛేంజర్ – 45 మంది ముఠాపై కేసు నమోదు

Game Changer Team Approach Cyber Crime Police: గేమ్ ఛేంజర్ టీం పోలీసులను ఆశ్రయించింది. తాము అడిగినంద డబ్బు ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది టీం. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మూవీ విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలోని కీలక వ్యక్తులకు వాట్సప్, సోషల్ మీడియాలో బెదిరింపు మెసేజ్ లు పంపారు. డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించారని, వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే సినిమాని లీక్ చేస్తామని బెదిరింపు పాల్పడినట్టు ఆరోపించారు.

పథకం ప్రకారం తమ సినిమాపై విషం కక్కిందని చిత్ర బృందం పేర్కొంది. ఈ కేసులో సైబర్ క్రైం పోలీసులు 45 మందితో కూడిన ముఠాపై కేసు నమోదు చేసింది. మరోవైపు రిలీజ్ కి రెండు రోజుల ముందే సినిమాలోని పలు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో లీక్ చేశారని పేర్కొన్నారు. ఇక మూవీ రిలీజైన రోజే సినిమాను ఆన్ లైన్ లో లీక్ చేశారంటూ మూవీ టీం పోలీసులకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన గేమ్ ఛేంజర్ టీం పోలీసులకు ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముఠా వెనుక ఉన్నదేవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో మూవీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాలపై కూడా గేమ్ ఛేంజర్ టీం కంప్లైంట్ ఇచ్చింది.

Exit mobile version
Skip to toolbar