Site icon Prime9

Naanaa Hyraanaa: గుడ్‌న్యూస్‌ – నానా హైరానా రెడీ, థియేటర్లోకి రాబోతున్న సాంగ్‌

naanaa hyraanaa song added in Theatres

naanaa hyraanaa song added in Theatres

Naanaa Hyraanaa Song Added: భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్‌ ఛేంజర్‌ మూవీ డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ సూపర్‌ అంటున్నారు. కానీ ఓవరాల్‌గా సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదంటున్నారు. అసలు ఇది ఓ గ్లోబల్‌ స్టార్‌ సినిమా కాదని అంటున్నారు. అసలు గేమ్‌ ఛేంజర్ పాన్‌ ఇండియా చిత్రం కాదని అంటున్నారు. ఈ సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అని ఆశపడ్డ ఫ్యాన్స్‌, మూవీ టీంకి నిరాశే ఎదురైంది. కలెక్షన్స్ కూడా మరి దారుణంగా ఉన్నాయి. ఈ చిత్రంతో శంకర్‌ చరణ్‌కి ఇండస్ట్రీ హిట్‌ ఇస్తాడనుకుంటే కనీసం హిట్‌ కూడా ఇవ్వలేదని సినీ క్రిటిక్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రిలీజ్‌కు ముందు గేమ్‌ ఛేంజర్‌ ప్రచార పోస్టర్స్‌, పాటలు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. శంకర్‌ సినిమాలోని పాటలకు ప్రత్యేకత ఉంటుంది. అలాగే గేమ్‌ ఛేంజర్‌లోనూ ప్రతి పాటను విభిన్నంగా రూపొందించారు. పాటలకే కోట్లు కోట్లు ఖర్చు పెట్టించాడు. ముఖ్యంగా ‘నానా హైరానా’ 10 కోట్లు పెట్టారు. ముఖ్యంగా ఇందులో మెలోడీ సాంగ్‌ నానా హైరానా పాటకు బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో సుమారు 53కి పైగా మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో మారుమ్రోగిన ఈ పాట ప్రతి ఒక్కరి ఫెవరేట్‌గా నిలిచింది. అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌ థియేటర్లో కనిపించలేదు. టెక్నికల్‌ ఇష్యూ కారణంగా ఈ సాంగ్‌ సినిమాలో ప్రదర్శించకలేకపోయామంటూ తొలిరోజు మూవీ టీం ట్వీట్‌ చేసింది.

ఇప్పుడు ఈ పాట రెడీ అయ్యిందని, ఇక సినిమాలో నానా హైరానాను జోడించినట్టు తాజాగా మూవీ టీం పేర్కొంది. అయితే జనవరి 14 నుంచి పాటను అందుబాటులోకి తెస్తామని చెప్పిన టీం రెండు రోజుల ముందుగానే సాంగ్‌ రేడీ చేసింది. ఈ రోజు (జనవరి 12) నుంచి పాటను సినిమాలో యాడ్‌ చేసినట్టు ఎక్స్‌ వేదికగా ప్రకటన ఇచ్చారు. దీంతో నానా హైరానా ప్రియులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ పాట కోసమైన మరోసారి థియేటర్‌ వెళ్లాలని టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. కాగా నానా హైరానా పాటను ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాతో షూట్‌ చేసినట్టు మూవీ టీం వెల్లడిచింది. ఈ టెక్నాలజీ తొలిసారిగా ఈ పాటకు వాడారు. ఈ సాంగ్‌ చిత్రీకరణకు మొత్తం రూ. 10కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాట సింగర్‌ కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు.

కాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి అంజలి కీలక పాత్రలో నటించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, జయరాం, సునీల్‌ వంటి నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. జనవరి 12న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 186పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకట్టించారు. ఫస్ట్‌డే కంటే సెకండ్ డే గేమ్‌ ఛేంజర్‌ కలెక్షన్స్‌ భారీ డ్రాప్‌ కనిపించింది. థియటర్లో ఆక్యూపెన్సీ తగ్గిపోడంలో కలెక్షన్స్‌ పడిపోయినట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ వ్యయంతో గేమ్‌ ఛేంజర్ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో అయినట్టు తెలుస్తోంది.

Exit mobile version