Aadi Keshava : మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల కలిసి నటిస్తున్న చిత్రం “ఆదికేశవ”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. పలు కారణాల రీత్యా ఆలస్యం అవుతూ వస్తుంది. కొత్త విడుదల తేదీన త్వరలోనే అనౌన్స్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక ఇటీవలే టీజర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి తెరలేపారు. ఈక్రమంలోనే సినిమా నుంచి మొదటి సింగల్ ప్రోమోని రిలీజ్ చేశారు.
‘సిత్తరాల సితారావతి’ సాగే ఈ పాట ప్రోమో చివరిలో వైష్ణవ్, శ్రీలీల వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ లిరికల్ సాంగ్ సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. అలాగే నవంబర్ 10న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఆ మైనింగ్ చేస్తూ శివుడి గుడిని కూడా విలన్స్ కూల్చడానికి ప్రయత్నిస్తుంటే హీరో వాళ్ళని అడ్డుకోవడమే సినిమా కథగా భావిస్తున్నారు. మొదటిసారి వైష్ణవ్ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించబోతుండడం విశేషం అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇటీవలే రంగా రంగా వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. హాట్ బ్యూటీ కేతిక శర్మ తో కలిసి నటించిన ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.