Site icon Prime9

Maname OTT: సుమారు ఏడాది.. ఎట్టకేలకు ఓటీటీకి శర్వానంద్‌ ‘మనమే’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Finally Manamey Movie Locks OTT Release Date: శర్వానంద్‌,కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా విక్రమాదిత్య చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన చిత్రం ‘మనమే’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. ఏ సినిమా అయిన థియేట్రికల్ రన్‌ పూర్తి చేసుకుని ఒకటి రెండు నెలల్లో ఓటీటీలో రిలీజ్‌కి వచ్చేసింది. అయితే మనమే మాత్రం ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదలై సుమారు ఏడాది కావస్తోంది.

దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ మనమే మూవీ డిజిటిల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మార్చి 7న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైం వీడియో మనమే ఓటీటీ రైట్స్‌ తీసుకుంది. దీంతో మార్చి 7 నుంచి ఈ సినిమాను అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. అంటే రేపటి నుంచి మనమే ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. ఎట్టకేలకు మనమే మూవీ ఓటీటీ వస్తుందని తెలిసి మూవీ లవర్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు.

కాగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం అందుకోలేకపోయింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజవీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మనమే మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన బాక్సాఫీసు వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను అందించింది. శర్వానంద్‌ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేస్తున్నాడు. దీనికి రేజ్‌ రాజా అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Exit mobile version
Skip to toolbar