Trivikram Srinivas: అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పూర్తిగా గుంటూరు కారం మీద దృష్టి పెట్టారు. మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ త్వరలో తన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.
స్క్రిప్ట్ రెడీ..(Trivikram Srinivas)
అయితే అల్లు అర్జున్ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తదుపరి చిత్రం మల్టీ స్టారర్ అని ఈ చిత్రంలో వెంకటేష్, నాని ప్రధాన పాత్రలు పోషిస్తారని తెలిసింది. త్రివిక్రమ్ మరియు వెంకటేష్ కలిసి పనిచేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు, కానీ అది ఆలస్యం అయింది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ మరియు మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాశారు. త్రివిక్రమ్ ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాని మరో ప్రధాన పాత్రలో నటిస్తాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మల్టీ స్టారర్‌ను నిర్మించనుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.