Site icon Prime9

Mrunal Thakur: ’సీతారామం‘ ఎఫెక్ట్.. మృణాల్ కు ఇన్ స్టాలో 5.4 మిలియన్ల ఫాలోవర్లు

mrunal thakur

mrunal thakur

Mrunal Thakur: కొంతమంది సెలబ్రిటీలకు మొదట్లో చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ వారి సినిమాల్లో ఒకటి క్లిక్ అయితే, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సమయంలోనైనా పెరుగుతుంది. ’సీతారామం‘ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గత 10 సంవత్సరాలలో, ఈ బ్యూటీ టీవీ సీరియల్స్ మరియు అనేక చిత్రాలలో పాత్రలు చేస్తూ దాదాపు 4.5+ మిలియన్ల మంది ఫాలోవర్లతో బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది,

బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు మంచి బ్రేక్ రాలేదు. నెట్‌ఫ్లిక్స్ యొక్క “బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్” వెబ్ సిరీస్‌లో శివగామి పాత్రను పోషించడానికి ఆమె సంతకం చేసినప్పుడు ఈమె గురించి టాలీవుడ్ కు మొదటిసారిగా తెలిసింది. అయితే, ఆమెతో చిత్రీకరించిన ఎపిసోడ్‌లు నెట్‌ఫ్లిక్స్ ను ఆకట్టుకోలేదు దానితో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు ఆమె “సీతారామం” చిత్రంతో వచ్చిన ఫేమ్ ను ఎంజాయ్ చేస్తోంది.

’సీతారామం‘ విడుదలకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ కు ఫాలోవర్స్ దాదాపు 4.5 మిలియన్ల మంది ఉన్నారు .ఇప్పుడు సినిమా విడుదలైన 20 రోజుల్లో అది 5.4 మిలియన్లకు చేరింది. ’సీతారామం‘ ఆకట్టుకోవడంతో చాలా మంది తెలుగు సినీ ప్రేమికులు ఇప్పుడు ఆమెకు అభిమానులుగా మారారు.

Exit mobile version