Site icon Prime9

Manjima Mohan: “కడలి” హీరోతో.. “నాగచైతన్య” హీరోయిన్ పెళ్లి

manjisha mohan getting married to gowtham karthik

manjisha mohan getting married to gowtham karthik

Manjima Mohan: నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి మంజిమా మోహన్. ఆ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించకపోవడం వల్ల మంజిమాకు తెలుగులో పెద్ద ఆఫర్స్ రాలేదు. కానీ తమిళ, మలయాళం మాత్రం వరుస మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. అయితే తాజాగా ఈ నటి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

వరుడు మరెవరో కాదండి కోలీవుడ్‌ సీనియర్‌ స్టార్, “సీతాకోక చిలుకలు” మూవీ ఫేమ్ కార్తీక్‌ తనయుడు, “కడలి” చిత్రం హీరో గౌతమ్‌ కార్తీక్‌. ఈ విషయాన్ని మంజిమా మోహన్‌ ఇన్‌స్టా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ‘దేవరాట్టం’ సినిమా మొదలు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నరన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ ప్రేమను సోమవారం ఇన్‌స్టా ద్వారా తమ అభిమానులకు అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం ఇక ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఈ వారంలో పది సినిమాలు రిలీజ్

Exit mobile version