Site icon Prime9

Manchu Vishnu: ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు అంటున్న మంచు విష్ణు..!

manchu vishnu tweet on prabas prime9news

manchu vishnu tweet on prabas prime9news

Manchu Vishnu: ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. విష్ణును ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోస్తున్నారు. మొన్నామధ్య ఆదిపురుష్ టీజర్ పై కామెంట్లు వేసిన మంచు వారి అబ్బాయి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయిన సంగతి తెలిసింది. ఇది మరువకముందే మరోసారి ఈయన ప్రభాస్ పై సంచలన కామెంట్లు వేశారంటూ అభిమానులు మండిపతున్నారు.

ఇప్పుడు ప్రభాస్ ని ఉద్దేశించి మంచు విష్ణు చేసిన ట్వీట్ మాత్రం వివాదాస్పదమైంది. ‘బ్రదర్ ఫర్ అనెదర్ మదర్ అనగా వేరే తల్లి కడుపు నుంచి వచ్చిన నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు. వచ్చే పుట్టినరోజుకైనా పెళ్లి చేసుకుంటాడో లేదో తెలీదు గానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని తెలుసు. నీ మీద ఎంతో ప్రేమ ఉంది నా డార్లింగ్ బ్రదర్’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.

దానిపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభాస్ పెళ్లి ప్రస్తావన లేకుండా ట్వీట్ చేయలేవా అంటూ విష్ణుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ ట్వీట్ ని తొలగించమని మరికొందరు రిక్వస్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు ఫ్యాన్స్ మాత్రం దాన్ని సమర్ధిస్తూ అన్న అన్నదాంట్లో తప్పేముంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఇదీ చదవండి: సరికొత్త లుక్ తో “విక్రమ్”.. “తంగలాన్” మూవీ వీడియో “గ్లింప్స్” రిలీజ్

Exit mobile version