Site icon Prime9

Manchu Lakshmi : ఆ పాత్రలో దుమ్మురేపిన మంచు లక్ష్మి..!

huge-appreciation-for-manchu-lakshmi-character-in-monster-movie

huge-appreciation-for-manchu-lakshmi-character-in-monster-movie

Manchu Lakshmi : తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాకముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

అలానే లాస్ వెగాస్’, ‘డెసపరేట్ హౌజ్ వైవ్స్’ లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో కూడా నటించింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో లక్ష్మీ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సాధించారు. అయితే తాజాగా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మీ ప్రసన్న.

సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాలో భామిని పాత్ర హనీ రోజ్ చేయగా… దుర్గ అనే క్యారెక్టర్ ని మంచు లక్ష్మీ పోషించారు. దుర్గ అనే పని మనిషి పాత్రలో లక్ష్మీ అదరగొట్టిందని చెప్పాలి. ఇక వీళ్లిద్దరూ ఈ సినిమాలో హోమో సెక్సువల్స్ గా నటించారు. ఈ జోడీ మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఛాలెంజింగ్ గా ఉండే ఇలాంటి రోల్స్ చేసి మంచు లక్ష్మీ… నటిగా మరో మెట్టు ఎక్కేసిందని అభిమనులంతా అభిప్రాయపడుతున్నారు.

అలానే ఈ సినిమా లోనే హీరో మోహన్ లాల్ తో ఒక ఫైట్ సీన్ కూడా చేయడం గమనార్హం. కాగా 2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రజలు వాళ్లను కొట్టి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఏం చేశారనే నిజ జీవిత కధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

Exit mobile version