‘Hi Nanna’ OTT: హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ప్రేక్షకుల ఆదరణ..(‘Hi Nanna’ OTT)
హాయ్ నాన్న చిత్రానికి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ లభించింది. నాని మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించిన , హాయ్ నాన్న చిత్రంలో బేబీ కియారా ఖన్నా, అంగద్ బేడి, నాసర్, జయరామ్, విరాజ్ అశ్విన్ మరియు ప్రియదర్శి నటించారు.ఈ చిత్రానికి సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకుర్చారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మోహన్ చెరుకూరి నిర్మించగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం విజయంతో సినిమా విజయంతో హీరో నాని తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మరింత ఉత్సాహంగా ఉన్నాడు.